చిరంజీవి పార్టీ పెట్టి ఏడాదికి అమ్మేస్తే...పవన్ | G.adiseshagiri rao takes on pawan kalyan, chiranjeevi | Sakshi
Sakshi News home page

చిరంజీవి పార్టీ పెట్టి ఏడాదికి అమ్మేస్తే...పవన్

Apr 26 2014 10:34 AM | Updated on Mar 22 2019 5:33 PM

చిరంజీవి పార్టీ పెట్టి ఏడాదికి అమ్మేస్తే...పవన్ - Sakshi

చిరంజీవి పార్టీ పెట్టి ఏడాదికి అమ్మేస్తే...పవన్

ఆల్ ఇండియా కృష్ణా-మహేష్ బాబు అభిమానుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

విశాఖ : ఆల్ ఇండియా కృష్ణా-మహేష్ బాబు అభిమానుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన శనివారం విశాఖలో విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్నారు. ఎన్నికల్లో  ఓటమి భయం చంద్రబాబు నాయుడు కళ్లలోనే కనిపిస్తోందన్నారు. సీమాంధ్రకు అన్యాయం చేసింది చంద్రబాబేనని ఆదిశేషగిరిరావు మండిపడ్డారు.

పవన్ కల్యాణ్ ఏం చూసి బీజేపీకి మద్దతు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మతతత్వాన్నా లేక ఊచకోతల్ని చూసి పవన్ మద్దతు ఇచ్చారో చెప్పాలని ఆదిశేషగిరిరావు ప్రశ్నించారు. చిరంజీవి పార్టీ పెట్టి ఏడాదికి అమ్మేస్తే... పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి రోజులు గడవక ముందే అమ్మేశారని ఆయన విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement