చంద్రబాబును నమ్మొద్దు: కిరణ్ | don't trust chandra babu - kiran | Sakshi
Sakshi News home page

చంద్రబాబును నమ్మొద్దు: కిరణ్

May 1 2014 1:23 AM | Updated on Jul 28 2018 6:33 PM

చంద్రబాబును నమ్మొద్దు: కిరణ్ - Sakshi

చంద్రబాబును నమ్మొద్దు: కిరణ్

తెలంగాణ విషయమై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న టీడీపీ నేత చంద్రబాబును నమ్మొద్దని జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

 చిత్తూరు,  తెలంగాణ విషయమై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న టీడీపీ నేత చంద్రబాబును నమ్మొద్దని జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం చిత్తూరులో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. గోద్రా అల్లర్లకు నరేంద్రమోడీనే కారణమన్న చంద్రబాబు ఎన్నికల్లో ఆయనతో జట్టు కట్టేందుకు తహతహలాడారని  విమర్శించారు.

రాష్ట్ర విభజనపై మే 5వ తేదీన సుప్రీంకోర్టులో తాను వేసిన కేసు విచారణకు వస్తుందని, విభజన తప్పని తీర్పు వస్తుందని నమ్మకం ఉందన్నారు. కోర్టు తీర్పు తర్వాత బిల్లు అసెంబ్లీకి వస్తుందన్నారు. తీర్పు వచ్చేనాటికి జేఎస్పీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే బిల్లును వ్యతిరేకించి రాష్ట్రాన్ని సమైక్యం గా ఉంచుతారన్నారు.  
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement