ప్రలోభాల్లో దొందూ దొందే...!

ప్రలోభాల్లో దొందూ దొందే...! - Sakshi


 విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: అధికారం కోసం కాంగ్రెస్, టీడీపీ నాయకులు అడ్డుదారులు తొక్కుతున్నా రు. బెదిరింపులు, బుజ్జగింపులు, ప్రలోభాలతో ఓటర్లను మాయ చేస్తున్నారు. జిల్లాలో నిఘా వర్గాలకు చిక్కుతున్న వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్, టీడీపీ వర్గాల వారే ఉం టున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు, విజయనగరం పార్లమెంట్ స్థానంతో పాటు అ రుకు, విశాఖ పార్లమెంటు స్థానాల పరిధిలో నిఘా బృం దాలు నిరంతరం దాడులు నిర్వహిస్తున్నాయి. జిల్లాలో నామినేషన్ల పర్వం నుంచి సభలు, సమావేశాలు, ప్రచారాలు నిర్వహించడంలో నిబంధనల ఉల్లంఘనలో టీడీపీ, కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా చూస్తే ఆ పార్టీలకు చెందిన అభ్యర్థులపైనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

 

 మెంటాడలో తెలుగుదేశం అభ్యర్థి రాత్రి పది గంటలు దాటిన తర్వాత కూడా ప్రచారం నిర్వహించడంతో అక్కడ ఫిర్యాదు ప్రకారం కేసు నమోదైంది.

 

ఎస్.కోట నియోజకవర్గం వసలో అనుమతులు లేకుం డా సభ నిర్వహించినందుకు అక్కడి తెలుగు దేశం పార్టీ అభ్యర్థి కోళ్ల లలితకుమారిపై కేసు నమోదు చేశారు.

 

చీపురుపల్లి కాంగ్రెస్ అభ్యర్థి బొత్స సత్యనారాయణపై నామినేషన్ కార్యక్రమానికి సంబంధించి గరివిడిలో లారీ ల్లో జనాల తరలింపుపై గత నెల 19న కేసు నమోదైంది. అలాగే ఇక్కడ లారీలను కూడా సీజ్ చేశారు.డబ్బు పంపిణీ కేసులో బొత్స అనుచరుడు చిన్న శ్రీను పై ఏ-1 నిందితునిగా కేసు నమోదు చేశారు.

 

 గత నెల 23న నెల్లిమర్ల టీడీపీ అభ్యర్థి పతివాడ నారాయణ స్వామినాయుడు అనుమతులు లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించారని కేసు నమోదైంది.

 

 విజయనగరంలో గత నెల 23న అధిక సంఖ్యలో బైక్‌లను అనుమతులు లేకుండా ర్యాలీగా తీసుకువచ్చి పట్టణంలోని ట్రాఫిక్ నిలిచిపోయినట్టుగా చేసిన దే శం అభ్యర్థి మీసాల గీతపై కేసు నమోదైంది.

 

 గత నెల 10న మెరకముడిదాంలో ఓటర్లకు డ బ్బులు పంచుతున్నారన్న కారణంగా పోలీసులు 15 మందిపై కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 70 వేల రూపాయలు నగదు స్వాధీనం చే సుకున్నారు.

 

 బొత్స సత్యనారాయణకు చెందిన ప్రచార వాహ న శ్రేణిలోని 5 వాహనాలకు అనుమతులు లేవని ఎన్నికల నిఘా వేదిక అధ్యక్షుడు, మాజీ ఎన్నికల కమిషన్ సలహా దారు కేజేరావు గుర్తించడంతో వాహనాలను సీజ్ చేశారు.

 

 పట్టణంలోని కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీలు మద్యం పంపిణీ చేస్తున్నట్టు స్వతంత్ర అభ్యర్థి రెడ్డి త్రినాథరావు కలెక్టరేట్‌లోని మానిటరింగ్ సెల్‌కు ఫిర్యాదు చేశారు.

 

 విజయనగరం టీడీపీ అభ్యర్థి మీసాల గీత ప్రభుత్వ ఆస్తులైన వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఓటర్లకు భోజ నాలు పెట్టి ప్రలోభాలకు గురి చేశారంటూ ఫిర్యాదు అం దింది. దీనిపై కేసు నమోదు చేయాల్సి ఉంది. మరో 28 చిన్న చిన్న ఫిర్యాదులను కూడా అధికారుల దృష్టికి రాగా వాటిని క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించారు.

 

 ఇలా చాలా చోట్ల టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన అభ్యర్థులే నేరుగా బరి తెగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రతీ చోటా వీలున్నంత వర కూ ప్రజలను ఇంతవరకూ దోచుకు తిన్న ఇరు పార్టీల నేతలూ ఇప్పడు అధికారం చేజారిపోతుందన్న ఆందోళన, అసహనంలో ఉన్నారు. దీంతో ప్రలోభాల పర్వానికి తెరలేపి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోతున్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top