ప్రియాంక గాంధీపై కోర్టులో ఫిర్యాదు | BJP leader files complaint in court against Priyanka Gandhi | Sakshi
Sakshi News home page

ప్రియాంక గాంధీపై కోర్టులో ఫిర్యాదు

May 7 2014 3:06 PM | Updated on Aug 14 2018 4:24 PM

'నీచ రాజనీతి' వ్యాఖ్యలు చేసిన ప్రియాంక గాంధీపై బీహార్ కోర్టులో ఫిర్యాదు దాఖలయింది.

పాట్నా: 'నీచ రాజనీతి' వ్యాఖ్యలు చేసిన ప్రియాంక గాంధీపై బీహార్ కోర్టులో ఫిర్యాదు దాఖలయింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి సూరజ్ నందన్ మెహతా స్థానిక కోర్టులో ఈ ఫిర్యాదు చేశారు. ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రామాకాంత్ యాదవ్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

శాంతి సామరస్యాలకు భంగం కలిగించేలా ప్రియాంక వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. ఈ ఫిర్యాదుపై రేపు విచారించే అవకాశముందని కోర్టు వర్గాలు తెలిపాయి. ప్రియాంక వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ అగ్రనాయకులు విమర్శలు గుప్పించాయి. మోడీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement