నేడు ఆంధ్రబ్యాంకులో చిల్లర నాణేల పంపిణీ | coin distribution in andhrabank | Sakshi
Sakshi News home page

నేడు ఆంధ్రబ్యాంకులో చిల్లర నాణేల పంపిణీ

Oct 5 2016 12:19 AM | Updated on Sep 4 2017 4:09 PM

విజయ దశమి, మొహర్రం, దీపావళి పర్వదినాలను పురష్కరించుకుని బుధవారం నాణేల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు ఆంధ్రబ్యాంకు డీజీఎం గోపాకృష్ణ తెలిపారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): విజయ దశమి, మొహర్రం, దీపావళి పర్వదినాలను పురష్కరించుకుని బుధవారం నాణేల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు ఆంధ్రబ్యాంకు డీజీఎం గోపాకృష్ణ తెలిపారు. మార్కెట్‌లో చిల్లర కొరత ఎక్కువగా ఉన్నందున దీనిని అధిగమించేందకు ఆంధ్రబ్యాంకు కర్నూలు ప్రజల అవసరార్థం  చిల్లర పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పార్క్‌ రోడ్‌ శాఖలో రూ.1, 2, 5 నాణేల పంపిణీ  ఉదయం 11 గంటలకు చేపడుతున్నామని ఈ అవకాశాన్ని ఖాతాదారులు తదితరులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement