ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే బాబు లక్ష్యం: మిథున్రెడ్డి | ysrcp mp mithun reddy slams over ap cm chandrababu on false cases | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే బాబు లక్ష్యం: మిథున్రెడ్డి

Jul 10 2016 7:24 PM | Updated on Aug 18 2018 6:11 PM

ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే బాబు లక్ష్యం: మిథున్రెడ్డి - Sakshi

ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే బాబు లక్ష్యం: మిథున్రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్రెడ్డి అన్నారు.

తిరుపతి: ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. గడప గడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమంలో భాగంగా కలకడ మండలంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి ఆదివారం ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మిథున్రెడ్డి మాట్లాడుతూ...వైఎస్సార్సీపీ పట్ల చంద్రబాబు సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం, ప్రభుత్వం తీరుపై న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని మిథున్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement