చంద్రబాబుపై ఎమ్మెల్యే మణిగాంధీ ఫైర్ | ysrcp mla mani gandhi fires on ap cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై ఎమ్మెల్యే మణిగాంధీ ఫైర్

Feb 20 2016 12:48 PM | Updated on Aug 18 2018 6:18 PM

చంద్రబాబుపై ఎమ్మెల్యే మణిగాంధీ ఫైర్ - Sakshi

చంద్రబాబుపై ఎమ్మెల్యే మణిగాంధీ ఫైర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు.

కర్నూలు జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ.... వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్తున్నారన్న వార్తలను ఖండించారు.

చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి జిల్లాకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని,  ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మణిగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను చిన్నచూపు చూస్తున్న చంద్రబాబు తగిన మూల్యం చెల్లించకోక తప్పదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement