గొల్లపూడి ప్రమాదం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి | YS Jagan mohanreddy demands probe on private travel bus incident | Sakshi
Sakshi News home page

గొల్లపూడి ప్రమాదం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Mar 15 2016 8:20 AM | Updated on Nov 9 2018 4:12 PM

గొల్లపూడి ప్రమాదం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి - Sakshi

గొల్లపూడి ప్రమాదం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

గొల్లపూడి సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

విజయవాడ: గొల్లపూడి సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బస్సు ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని వైఎస్ జగన్ కోరారు.

గొల్లపూడి సమీపంలోని సురయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆరుగురు ఐసీయూలో ఉండగా, ఇద్దరు విద్యార్థులకు శస్త్రచికిత్సలు జరిగాయి. మరికొందరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement