విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని దీక్షకుంటలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై వెంకట్రావ్ కథనం ప్రకారం.. గ్రామంలో వ్యవసాయం చేసుకొని జీవించే ఉల్లేరావు పోషయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
Sep 26 2016 12:28 AM | Updated on Sep 28 2018 3:41 PM
భూపాలపల్లి: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని దీక్షకుంటలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై వెంకట్రావ్ కథనం ప్రకారం.. గ్రామంలో వ్యవసాయం చేసుకొని జీవించే ఉల్లేరావు పోషయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుడు తిరుపతి(24) టీఆర్‌ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి పొలం నుంచి ఇంటికి వచ్చి, టీవీ ఆన్ చేయగా రాకపోవడంతో విద్యుత్ వైర్లను సరిచేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి పోషయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Advertisement


