విషజ్వరంతో మరొకరు మృతి | young man dead with viralfeavour | Sakshi
Sakshi News home page

విషజ్వరంతో మరొకరు మృతి

Aug 10 2016 10:59 PM | Updated on Sep 4 2017 8:43 AM

మహదేవపూర్‌ మండలం బెగులూర్‌ గ్రామానికి చెందిన కారు శ్రీనివాస్‌(36) విషజ్వరంతో బుధవారం మరణించాడు. వారంరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది.

  • బెగులూర్‌లో ఘటన 
  • కాళేశ్వరం : మహదేవపూర్‌ మండలం బెగులూర్‌ గ్రామానికి చెందిన కారు శ్రీనివాస్‌(36) విషజ్వరంతో బుధవారం మరణించాడు. వారంరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో అతడిని వరంగల్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. ఈయన మృతితో బెగులూర్‌లో మరణించినవారి సంఖ్య ఇప్పటివరకు ఐదుకు చేరింది. మండలవ్యాప్తంగా 11 మందికి చేరింది. శ్రీనివాస్‌కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా.. ఇదే గ్రామానికి చెందిన మరి కొంతమంది వరంగల్‌లోని వివిధ ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భార్యభర్తలైన సుబ్బరాజు, విజయలక్ష్మీ డెంగీ లక్షణాలతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. విషజ్వరాలతో గ్రామస్తులు భయపడుతున్నా.. వైద్యులు మాత్రం దీర్ఘకాలిక సమస్యలతోనే చనిపోతున్నారని పేర్కొంటుండడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement