viralfeavour
-
విషజ్వరంతో మహిళ మృతి
బోయినపల్లి : మండలంలోని తడగొండ గ్రామానికి చెందిన సారబుడ్ల రజిత(30) అనే వివాహిత విషజ్వరంతో మృతి చెందింది. రజిత, రమేష్‌రెడ్డి కుటుంబం కొంతకాలంగా కరీంనగర్‌లోని సూర్యనగర్‌లో నివాసం ఉంటూ తెలంగాణ చౌక్ సమీపంలో జీఎస్ టిఫిన్ సెంటర్, రెడ్డి చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. రజితకు పది రోజుల క్రితం జ్వరం రాగా.. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్ తరలించారు. అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న రజిత బుధవారం మృతి చెందింది. -
బెగులూర్‌ను సందర్శించిన అడిషనల్ హెల్త్ డైరెక్టర్
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం బెగులూర్‌ను అడిషినల్ హెల్త్ డైరెక్టర్ ఆఫ్ మలేరియా, ఫైలేరియా వైద్యులు ప్రభావతి గురువారం సందర్శించారు. జ్వరాలతో మృతి చెందిన lవారి గురించి ఆరా తీశారు. పారిశుధ్యలోపంతోనే జ్వరాలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర కన్సల్టెంట్ సంజీవరెడ్డి, సైదులు, క్లస్టర్ ఎస్పీహెచ్వో సమియెుద్దీన్, ఎస్వీవో నాగిరెడ్డి, హెచ్‌ఈవో రమేశ్, మలేరియా, హెల్త్సూపర్వైజర్లు లార్వాలను నిర్మూలించడంలో పాల్గొన్నారు. -
బెగుళూరులో ప్రత్యేక వైద్య బృందం
కాళేశ్వరం: విషజ్వరాలు విజృంభిస్తున్న మహదేవపూర్ మండలం బెగుళూరులో మలేరియా ప్రబలేందుకు కారణాలు తెలుసుకుని నివారణ చర్యలు సూచించేందుకు వరంగల్ మలేరియా ఎంటమాలిజికల్ బందం శనివారం పర్యటించింది. విషజ్వరాల వ్యాప్తికి కారణమవుతున్న దోమల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపారు. మలేరియా నివారణ బందం గ్రామంలో ఏసీఎం అల్ఫాసైఫామైత్రిమ్, ప్రతి ఇంట్లో దోమల నివారణ రసాయనాలు స్ప్రే చేస్తోంది. దోమల లార్వాల నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. మండలంలో విషజ్వరాల బారిన పడి ఇప్పటికే 17మంది మత్యువాత పడ్డారు. అందులో ఒక్క బెగులూరులోనే తొమ్మిది మంది మతిచెందడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. పర్యటనలో డీఎం డాక్టర్ రవీందర్, క్లస్టర్ ఎస్పీహెచ్వో సమియోద్దీన్, వైద్యులు అశ్విని, దీపక్, ఎస్వీవో నాగిరెడ్డి, కంట్రోల్ ల్యాబ్ ఇన్సెక్టు కలెక్టర్ సుకుమార్, జోనల్ మలేరియా హెచ్‌ఈవో అజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ముందు జాగ్రత్త చర్యలతో వ్యాధులు అరికట్టాలి
కలెక్టర్ నీతూప్రసాద్ ముకరంపుర: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధుల నివారణపై వైద్యాధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. మంథని ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగీ, మలేరియా, విషజ్వరాలు ప్రబలుతున్నాయన్నారు. జ్వరాలు సోకిన గ్రామాలలో వెంటనే వైద్యశిబిరాలు నిర్వహించాలని, ఇంటింటికీ వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. జ్వరాలు సోకి ప్లేట్లెట్స్ తగ్గిన, డెంగీ పాజిటివ్ వచ్చిన కేసులను నేరుగా కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి పంపించాలని ఆదేశించారు. ప్రధాన ఆసుపత్రిలో జ్వరాలకు ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశామని, అత్యవసర వైద్య సేవలతోపాటు అవసరమైన వారికి ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నామని తెలిపారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అత్యవసర మందులను నిల్వ ఉంచుకోవాలని ఆదేశించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జేసీ నాగేంద్ర, డీఎంహెచ్‌వో రాజేశం, డీసీహెచ్‌వో అశోక్‌కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సూర్యప్రకాశ్‌రావు, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ పాల్గొన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి అంగన్వాడీ కేంద్రాలకు వచ్చిన గర్భిణులకు మాత్రమే పాలు, గుడ్లు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మార్పు జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మాతా శిశు ఆరోగ్య రక్షణ లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ ఉండాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలన్నారు. ఐరన్ సిరప్ బాటిల్స్ ఉంచాలని సూచించారు. గ్రామాల్లో రక్తహీనతతో బాధపడుతున్న బాలికలను గుర్తించి ఐరన్ బిల్లలు పంపిణీ చేయాలన్నారు. -
విషజ్వరంతో మరొకరు మృతి
బెగులూర్‌లో ఘటన కాళేశ్వరం : మహదేవపూర్ మండలం బెగులూర్ గ్రామానికి చెందిన కారు శ్రీనివాస్(36) విషజ్వరంతో బుధవారం మరణించాడు. వారంరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో అతడిని వరంగల్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. ఈయన మృతితో బెగులూర్‌లో మరణించినవారి సంఖ్య ఇప్పటివరకు ఐదుకు చేరింది. మండలవ్యాప్తంగా 11 మందికి చేరింది. శ్రీనివాస్‌కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా.. ఇదే గ్రామానికి చెందిన మరి కొంతమంది వరంగల్‌లోని వివిధ ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భార్యభర్తలైన సుబ్బరాజు, విజయలక్ష్మీ డెంగీ లక్షణాలతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. విషజ్వరాలతో గ్రామస్తులు భయపడుతున్నా.. వైద్యులు మాత్రం దీర్ఘకాలిక సమస్యలతోనే చనిపోతున్నారని పేర్కొంటుండడం గమనార్హం.