ముందు జాగ్రత్త చర్యలతో వ్యాధులు అరికట్టాలి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధుల నివారణపై వైద్యాధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. మంథని ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగీ, మలేరియా, విషజ్వరాలు ప్రబలుతున్నాయన్నారు.
-
కలెక్టర్ నీతూప్రసాద్
ముకరంపుర: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధుల నివారణపై వైద్యాధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. మంథని ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగీ, మలేరియా, విషజ్వరాలు ప్రబలుతున్నాయన్నారు. జ్వరాలు సోకిన గ్రామాలలో వెంటనే వైద్యశిబిరాలు నిర్వహించాలని, ఇంటింటికీ వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. జ్వరాలు సోకి ప్లేట్‌లెట్స్ తగ్గిన, డెంగీ పాజిటివ్ వచ్చిన కేసులను నేరుగా కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి పంపించాలని ఆదేశించారు. ప్రధాన ఆసుపత్రిలో జ్వరాలకు ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశామని, అత్యవసర వైద్య సేవలతోపాటు అవసరమైన వారికి ప్లేట్‌లెట్స్ ఎక్కిస్తున్నామని తెలిపారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అత్యవసర మందులను నిల్వ ఉంచుకోవాలని ఆదేశించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జేసీ నాగేంద్ర, డీఎంహెచ్‌వో రాజేశం, డీసీహెచ్‌వో అశోక్‌కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సూర్యప్రకాశ్‌రావు, డీఆర్‌డీఏ పీడీ అరుణశ్రీ పాల్గొన్నారు.
గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చిన గర్భిణులకు మాత్రమే పాలు, గుడ్లు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మార్పు జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మాతా శిశు ఆరోగ్య రక్షణ లక్ష్యంగా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ ఉండాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించాలన్నారు. ఐరన్ సిరప్ బాటిల్స్ ఉంచాలని సూచించారు. గ్రామాల్లో రక్తహీనతతో బాధపడుతున్న బాలికలను గుర్తించి ఐరన్ బిల్లలు పంపిణీ చేయాలన్నారు.