విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి | Worker died with Electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

Sep 25 2016 12:14 AM | Updated on Sep 28 2018 3:41 PM

పావగడ పట్టణ పోలీస్‌ స్టేషన్‌పరిధిలోని బళ్లారి రోడ్డులో శనివారం ఉదయం విద్యుదాఘాతంతో కలకత్తాకు చెందిన కేబుల్‌ కార్మికుడు భపిన్‌రాయ్‌(24) మృతి చెందాడు.

మడకశిర: పావగడ పట్టణ పోలీస్‌ స్టేషన్‌పరిధిలోని బళ్లారి రోడ్డులో శనివారం ఉదయం విద్యుదాఘాతంతో కలకత్తాకు చెందిన కేబుల్‌ కార్మికుడు భపిన్‌రాయ్‌(24) మృతి చెందాడు. నిరంతరజ్యోతి పథకం కింద కేబుల్‌ వైరు లాగుతున్న సమయంలో స్థానిక బెస్‌కామ్‌ కార్యాలయానికి సంబంధించిన విద్యుత్‌ తీగ తగలడంతో షాక్‌కు గురై మరణించినట్లు పోలీసులు తెలిపారు.
 
విద్యుత్‌ లైన్‌ క్లియర్‌ తీసుకున్నా కూడా విద్యుత్‌ సరఫరా అవడంతో బెస్‌కామ్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో శవపరీక్ష నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మంజునాథ్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement