ఇసుక అక్రమ రవాణాను ఆపాలి | women protests at kotauratla MRO office | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ రవాణాను ఆపాలి

Sep 3 2015 12:09 PM | Updated on Sep 3 2017 8:41 AM

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతూ... మహిళలు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు.

విశాఖపట్నం : ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతూ... మహిళలు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సంఘటన విశాఖ జిల్లా కోట ఊరట్లలో గురువారం జరిగింది.  గొట్టివాడ గ్రామానికి చెందిన మహిళలంతా కలిసి ఈ రోజు తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొన్నారు.

తమ గ్రామ సమీపంలోని వరహా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా తాహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement