‘పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తుంటే చంపేశా’ | Women murdered in suryapeta | Sakshi
Sakshi News home page

‘పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తుంటే చంపేశా’

Dec 22 2016 6:48 PM | Updated on Sep 4 2017 11:22 PM

‘పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తుంటే చంపేశా’

‘పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తుంటే చంపేశా’

సూర్యాపేట జిల్లా మునగాల అలుగుల వద్ద జరిగిన మహిళ హత్యకేసును పోలీసులు ఛేదించారు.

మునగాల(సూర్యాపేట): సూర్యాపేట జిల్లా మునగాల అలుగుల వద్ద జరిగిన మహిళ హత్యకేసును పోలీసులు ఛేదించారు. స్థానికంగా నివాసముంటున్న వేట ఉపేంద్ర(38) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో బండరాళ్లతో మోది దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరపగా.. గ్రామానికి చెందిన వల్లోజు సతీష్(24)తో ఉపేంద్రకు వివాహేతర సంబంధం ఉందని తేలింది.

దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ తరహాలో ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. ఈ మధ్య కాలంలో ఉపేంద్ర పెళ్లి చేసుకోమని బలవంత పెడుతుండటంతో.. బండరాళ్లతో మోది హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు కోదాడ సీఐ రజితారెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement