నెల్లూరు జిల్లాలో లారీ బీభత్సం | women dies after rush in to hotel in nellore | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో లారీ బీభత్సం

Jul 31 2016 8:09 AM | Updated on Aug 30 2018 4:07 PM

నెల్లూరు జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది.

బోగోలు(నెల్లూరు): నెల్లూరు జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. జిల్లాలోని బోగోలు మండలం కప్పరాళ్లచిప్ప గ్రామ శివారులోని బైపాస్ రోడ్డు వద్ద అదుపుతప్పిన ఓ లారీ రోడ్డు పక్కన ఉన్న ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది.

దీంతో హోటల్‌లో ఉన్న ఓ మహిళ మృతిచెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement