వివాహిత ఆత్మహత్య | woman suicides in kadiri | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Mar 24 2017 11:15 PM | Updated on Nov 6 2018 7:53 PM

కదిరి ఎన్జీఓ కాలనీలో అరవింద్‌కుమార్‌ భార్య నాగమణి (32) అనే వివాహిత శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

కదిరి టౌన్‌ : కదిరి ఎన్జీఓ కాలనీలో అరవింద్‌కుమార్‌ భార్య నాగమణి (32) అనే వివాహిత శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పలు చోట్ల వైద్య చికిత్సలు చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు ఉరేసుకుని తనువు చాలించినట్లు వివరించారు. మృతురాలి తండ్రి నాగేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. మృతురాలికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా దంపతుల మధ్య నెలకొన్న విభేదాలే ఆత్మహత్యకు దారితీసినట్లు తెలిసింది. నిజనిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాలి.

Advertisement
 
Advertisement
Advertisement