వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి | upadhi coole died with sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

Mar 29 2017 10:17 PM | Updated on Aug 25 2018 5:17 PM

మెట్టుపల్లె గ్రామంలో ఉపాధి కూలీ ఒకరు వడదెబ్బతో బుధవారం మృతి చెందారు.

అవుకు: మెట్టుపల్లె గ్రామంలో ఉపాధి కూలీ ఒకరు వడదెబ్బతో బుధవారం మృతి చెందారు. స్థానికులు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గడ్డం పుల్లయ్య (35)ఉదయం ఉపాధి పనికి వెళ్లి.. 11 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురై స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. మృతునికి భార్య రమాదేవి, ఒక కూతురు, కూమారుడు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement