‘వర్క్‌ ఫ్రమ్‌ బైక్‌’ అంటే ఇదే కాబోలు.. వైరల్‌ వీడియో | Hyderabad CP Sajjanar Slams Viral Work From Bike Video, Warns Against Risky Road Behavior, Watch Video Inside | Sakshi
Sakshi News home page

‘వర్క్‌ ఫ్రమ్‌ బైక్‌’ అంటే ఇదే కాబోలు.. వైరల్‌ వీడియో

Jun 13 2026 4:53 PM | Updated on Jun 13 2026 6:01 PM

Hyderabad Cp Sajjanar Responds To Work From Bike Video

సాక్షి, హైదరాబాద్‌: ల్యాప్‌టాప్‌లో పని చేసుకుంటూ బైక్‌ నడుపుతూ వెళ్తున్న ఓ యువకుడి వీడియో.. వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ‘వర్క్‌ ఫ్రమ్‌ బైక్‌’ అంటూ ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ వీడియోపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కూడా స్పందించారు.

రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు మానుకోవాలంటూ హితవు పలికిన సజ్జనార్‌.. ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుంటే... ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోంది’’ అంటూ ఆయన ఎక్స్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘రోడ్డు మీద మీ ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా, అది మీ ప్రాణానికే కాదు, పక్కన వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా ప్రమాదకరం. గుర్తుంచుకోండి... కడుపు నింపుకోవడానికి చేసే పని, కడతేర్చేలా ఉండకూడదు. దయచేసి రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు మానేయండి. సురక్షితంగా ప్రయాణించి, క్షేమంగా మీ గమ్యస్థానాలకు చేరుకోండి’’ అంటూ వీసీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement