రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి | Unidentified man hit and killed by train | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

Jul 24 2016 7:29 PM | Updated on Sep 4 2018 5:21 PM

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ఆర్.లాలియానాయక్ తెలిపిన వివరాల ప్రకారం... ఆర్ట్స్ కాలేజీ - సీతాఫల్‌మండి రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి (50) పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుని ఒంటిపైన లైట్ వాయిలేట్ కలర్ గీతల ఫుల్‌షర్టు, వంకాయ కలర్ ఫ్యాంట్ ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement