హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌ ప్రారంభం | Inauguration of Hitech City Amrit Bharat Railway Station by PM Modi | Sakshi
Sakshi News home page

హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌ ప్రారంభం

Jul 18 2026 5:47 AM | Updated on Jul 18 2026 5:47 AM

Inauguration of Hitech City Amrit Bharat Railway Station by PM Modi

హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌ ప్రారంబోత్సవంలో పాల్గొన్న ఎ.వి.ఎన్‌.రెడ్డి, రాంచందర్‌రావు, ద.మ. రైల్వే జీఎం శ్రీవాస్తవ, సికింద్రాబాద్‌ డీఆర్‌ఎం ఆర్‌.గోపాలకృష్ణన్‌

వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని  

మాదాపూర్‌ (హైదరాబాద్‌): హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఇరవై రాష్ట్రాలలోని 75 అమృత్‌ స్టేషన్లను వర్చువల్‌ విధానంలో శుక్రవారం ఆయన ప్రారంభించారు. అమృత్‌ భారత్‌లో భాగంగా తెలంగాణలోని హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌తో సహా దేశవ్యాప్తంగా మొత్తం 75 పునరాభివృద్ధి చేసిన రైల్వేస్టేషన్‌లను జలంధర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎ.వి.ఎన్‌.రెడ్డి మాట్లాడుతూ.. మధ్యతరగతి ప్రజల అవసరాలను తీర్చే విధంగా రైల్వేల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా 6 పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, పెయింటింగ్‌ పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. సెల్ఫీ పోటీ విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా జరిగిన సాంస్కృతిక, జానపద నృత్య ప్రదర్శనలు అలరించాయి. హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు, దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ, సికింద్రాబాద్‌ డివిజన్‌ రైల్వే మేనేజర్‌ డాక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement