రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం | Two killed in road accidents | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం

Aug 22 2016 11:26 PM | Updated on Aug 30 2018 4:07 PM

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం - Sakshi

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం

జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. కుమారుడికి ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని వచ్చే క్రమంలో తండ్రి, అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఓ మహిళ మృత్యువాతపడిన వారిలో ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి.

కదిరి టౌన్‌/ ఎస్కేయూ :

జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. కుమారుడికి ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని వచ్చే క్రమంలో తండ్రి, అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఓ మహిళ మృత్యువాతపడిన వారిలో ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. నల్లచెరువు మండల కేంద్రానికి చెందిన నూనె వ్యాపారి మహబూబ్‌బాషా (50) తన కుమారుడు ముస్తాక్‌కు ఆరోగ్యం బాగలేకపోవడంతో సోమవారం సాయంత్రం ద్విచక్రవాహనంలో తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌కు ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. ఆస్పత్రిలో చూపించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో  ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. మహబూబ్‌బాషాకు తీవ్రంగాను, కుమారుడికి స్వల్పంగాను గాయాలయ్యాయి. స్థానికులు కదిరి ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అనంతరం తీసుకెళ్లాలని వైద్యులు సూచించేలోపే మహబూబ్‌బాషా మృతి చెందాడు. మృతదేహంపై పడి భార్య, కుటుంబ సభ్యులు రోదించిన తీరు కలచివేసింది. తనకల్లు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన రాజేంద్ర, భవానీ భార్యాభర్తలు. భవానీ తండ్రి మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇద్దరూ కదిరికి వెళ్లారు. సోమవారం వీరిద్దరూ లక్ష్మిదేవి (45) అనే మహిళతో కలిసి ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి బయల్దేరారు. ఎస్కేయూ సమీపంలోని సమతాగ్రాం వద్ద ఈచర్‌ వాహనాన్ని దాటే క్రమంలో అదుపుతప్పి కిందపడ్డారు. తలకు తీవ్రగాయం కావడంతో లక్ష్మిదేవి (45) అక్కడికక్కడే చనిపోయింది. రాజేంద్ర, భవానీలకు గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement