బోరుబండిని ఢీకొన్న కారు : ఇద్దరు మృతి | two killed in road accident in prakasm district | Sakshi
Sakshi News home page

బోరుబండిని ఢీకొన్న కారు : ఇద్దరు మృతి

Aug 24 2016 8:25 AM | Updated on Aug 30 2018 4:07 PM

కొనకమిట్ల మండలం మర్రిపాలెం సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న బోరుబండిని కారు ఢీకొట్టింది.

ఒంగోలు : కొనకమిట్ల మండలం మర్రిపాలెం సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న బోరుబండిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరంతా నెల్లూరు జిల్లా కావలిలో ఓ ఫంక్షన్‌కు హాజరై మెదక్ జిల్లా సిద్ధిపేట తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement