కొండగట్టు వద్ద ప్రమాదం..ఇద్దరు మృతి | two dies in road accidet at kondagattu | Sakshi
Sakshi News home page

కొండగట్టు వద్ద ప్రమాదం..ఇద్దరు మృతి

Dec 10 2016 8:45 AM | Updated on Aug 30 2018 4:07 PM

కొండగట్టు వద్ద ప్రమాదం..ఇద్దరు మృతి - Sakshi

కొండగట్టు వద్ద ప్రమాదం..ఇద్దరు మృతి

జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు.

మల్యాల(జగిత్యాల): జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి పట్టణానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు కారులో వరంగల్‌లో జరిగే వివాహానికి వెళ్తున్నారు. కొండగట్టు సమీపంలోకి వెళ్లగానే వారి వాహనం ముందు వెళుతున్న కంటెయినర్‌పై నుంచి ట్యాంకర్‌లాంటి భారీ వస్తువు కిందపడింది.

దానిని తప్పించబోయి కారు రోడ్డుపక్కన చెట్టును ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు చనిపోగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement