రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి | two dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

Feb 5 2017 1:12 PM | Updated on Aug 30 2018 4:10 PM

స్థానిక బీచ్‌ రోడ్డులో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.

విశాఖపట్నం :
స్థానిక బీచ్‌ రోడ్డులో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్‌పై వెళుతున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.

ప్రమాదాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార‍్టం నిమిత‍్తం ఆస్పత్రికి తరలించి ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుల వివరాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement