కారు బోల్తా.. ఇద్దరి మృతి | two died in car overturned road accident | Sakshi
Sakshi News home page

కారు బోల్తా.. ఇద్దరి మృతి

Nov 15 2016 7:11 AM | Updated on Aug 30 2018 4:10 PM

కారు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.

జగిత్యాల: కారు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. అతివేగంతో వెళ్తున్న కారు అదుతప్పింది. ఆ వెంటనే బోల్తాపడి కారు పల్టీలు కొట్టడంతో అందులో ప్రయాణిస్తోన్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement