బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరి మృతి | two died in a road accident in medak district | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరి మృతి

Sep 8 2016 9:27 AM | Updated on Aug 30 2018 4:07 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడకిక్కడే మృతిచెందారు.

పటాన్‌చెరు : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడకిక్కడే మృతిచెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా పటాన్‌చెరు శివారులోని పోచారం కూడలి వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.

దీంతో బైక్ పై వెళ్తున్న బాలచందర్(23), సాయి(25) అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement