ఫంక్షన్ నుంచి తిరిగి వెళ్తూ అనంత లోకాలకు... | two Bengaluru people died in a car slipped incident | Sakshi
Sakshi News home page

ఫంక్షన్ నుంచి తిరిగి వెళ్తూ అనంత లోకాలకు...

Feb 28 2016 6:23 PM | Updated on Aug 25 2018 6:06 PM

వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా..

బాలనగర్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ మండలం రాజాపూర్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన వెంకటరాజ్ గుప్తా(70) కుటుంబం హైదరాబాద్‌లో జరుగుతున్న ఓ శుభకార్యానికి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.

అనంతరం తిరిగి బెంగళూరు వెళ్తున్న క్రమంలో కారు రాజాపూర్ వద్దకు చేరుకోగానే అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో వెంకటరాజ్ గుప్తా(70), అనిరూధ్(16) అక్కడికక్కడే మృతిచెందగా పృథ్వి(12)తో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement