ముగిసిన పసుపు కొనుగోళ్లు | turmeric purchasing ends | Sakshi
Sakshi News home page

ముగిసిన పసుపు కొనుగోళ్లు

Jun 29 2017 11:12 PM | Updated on Sep 5 2017 2:46 PM

స్థానిక మార్కెట్‌ యార్డులో మార్క్‌ఫెడ్‌ ద్వారా గత 40 రోజులుగా నిర్వహిస్తున్న పసుపు కొనుగోళ్లు గురువారంతో ముగిశాయి.

నంద్యాల అర్బన్‌: స్థానిక మార్కెట్‌ యార్డులో మార్క్‌ఫెడ్‌ ద్వారా గత 40 రోజులుగా నిర్వహిస్తున్న పసుపు కొనుగోళ్లు గురువారంతో ముగిశాయి. ఈ సందర్‌భంగా నంద్యాల మార్క్‌ఫెడ్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ నాగరాజు మాట్లాడుతూ.. రూ.35కోట్లతో ఇప్పటి వరకు 5,200క్వింటాళ్ల పసుపును కొనుగోలు చేశామన్నారు. కొనుగోళ్లకు సంబంధించిన 2, 463మంది రైతుల నుంచి టోకెన్లు తీసుకున్నామని, 2, 370 రైతులకు సంబంధించిన పసుపును కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈనెల 18 వరకు రైతులకు రావాల్సిన నగదును వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. మిగిలిన నగదును రెండు మూడురోజుల్లో వారం రోజుల్లో జమ అయ్యేలా చూస్తామన్నారు. కొనుగోళ్ల కొనసాగింపుకు సంబంధించిన సమాచారం అధికారుల నుంచి రాలేదని స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement