నంద్యాల: నంద్యాల శ్రీనివాస్ సెంటర్ వద్ద మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడమే కాకుండా అది వైఎస్సార్‌సీపీ కార్యకర్త పనే అంటూ టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని వైఎస్సార్‌సీపీ ఖండించింది. ఘటన జరిగి కొద్ది సేపట్లోనే టీడీపీ వారి సోషల్ మీడియా హ్యాండిల్‌లో తప్పుడు ప్రచారం మొదలు పెట్టడంపై మండిపడింది.
పోలీసులు మాత్రం మతిస్థిమితం లేని వ్యక్తి అని సర్టిఫికేట్ చూపించి విషయాన్ని తప్పదోవ పట్టించే ప్రయత్నం చెశారని వైఎస్సార్‌సీపీ మండిపడింది. ధ్వంసం చేసిన వ్యక్తి టీడీపీ-జనసేన నాయకులతో తిరిగితే అతను వైఎస్సార్‌సీపీ కార్యకర్త అంటూ చెప్పడాన్ని ప్రశ్నించింది. కచ్చితంగా ఈ ఘటన వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది.
ఈ ధర్నాలో నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి , ఎమ్మెల్సీ ఇషాక్ భాషా , పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.


