రోజూ లక్షమందికి టీటీడీ అన్నదానం | ttd annadanam for devotees | Sakshi
Sakshi News home page

రోజూ లక్షమందికి టీటీడీ అన్నదానం

Aug 18 2016 9:14 PM | Updated on Sep 4 2017 9:50 AM

రోజూ లక్షమందికి టీటీడీ అన్నదానం

రోజూ లక్షమందికి టీటీడీ అన్నదానం

కృష్ణా పుష్కరాల సందర్భంగా కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ప్రతి రోజూ లక్షమందికి అన్నదానం చేస్తునట్లు టీటీడీ జె.ఈ.వో శ్రీనివాసరాజు చెప్పారు.

విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ప్రతి రోజూ లక్షమందికి అన్నదానం చేస్తునట్లు టీటీడీ జె.ఈ.వో శ్రీనివాసరాజు చెప్పారు. గురువారం పున్నమ్మతోటలోని టి.టీ.డీ కళ్యాణమండపంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పుష్కర భక్తులకు నిత్యం లక్షమందికి అన్నప్రసాదం అందించేందుకు టీటీడీ కళ్యాణమండపంలో అత్యాధునికమైన వంటశాలను నిర్మించామని తెలిపారు. కళ్యాణమండపం నుంచి నగరంలో ఆర్‌టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, వై.వీ.ఆర్‌. ఎస్టేట్, సీతమ్మవారి పాదాలు, సీతానగరంలోని ఉండవల్లి సెంటర్‌లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన వసతి కల్పిస్తునట్లు తెలిపారు. అన్నదానం 23 దాకా సాగుతుందని తెలిపారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement