breaking news
puskara devotee
-
రోజూ లక్షమందికి టీటీడీ అన్నదానం
విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ప్రతి రోజూ లక్షమందికి అన్నదానం చేస్తునట్లు టీటీడీ జె.ఈ.వో శ్రీనివాసరాజు చెప్పారు. గురువారం పున్నమ్మతోటలోని టి.టీ.డీ కళ్యాణమండపంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పుష్కర భక్తులకు నిత్యం లక్షమందికి అన్నప్రసాదం అందించేందుకు టీటీడీ కళ్యాణమండపంలో అత్యాధునికమైన వంటశాలను నిర్మించామని తెలిపారు. కళ్యాణమండపం నుంచి నగరంలో ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, వై.వీ.ఆర్. ఎస్టేట్, సీతమ్మవారి పాదాలు, సీతానగరంలోని ఉండవల్లి సెంటర్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన వసతి కల్పిస్తునట్లు తెలిపారు. అన్నదానం 23 దాకా సాగుతుందని తెలిపారు. -
ఆహారపొట్లాల పంపిణీ
రైల్వేస్టేషన్ : సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం రైల్వేస్టేషన్ ఆవరణలోని గడియారం స్తంభం దగ్గర పుష్కర యాత్రికులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్వే మల్లాది విష్ణు మాట్లాడుతూ పుష్కరయాత్రికులకు సేవ చేసే భాగ్యం కలగడం సంతోషంగా ఉందన్నారు. వందలాది మంది యాత్రికులకు వెజిటబుల్ బిర్యానీ, వాటర్ప్యాకెట్లను అందించారు. కాంగ్రెస్ నాయకులు మీసాల రాజేశ్వరరావు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.