శ్రీశైలం, సంగమేశ్వరంలో ఈనెల 12 నుంచి 23వ తేదీ వరకు కృష్ణా పుష్కరాల విధులను విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగుల అభినందన సభ ఈనెల 31న నిర్వహించనున్నారు.
నేడు పుష్కరాల విజయోత్సవ సభ
Aug 31 2016 1:10 AM | Updated on Sep 4 2017 11:35 AM
కర్నూలు(అగ్రికల్చర్): శ్రీశైలం, సంగమేశ్వరంలో ఈనెల 12 నుంచి 23వ తేదీ వరకు కృష్ణా పుష్కరాల విధులను విజయవంతంగా నిర్వహించిన అధికారులు, ఉద్యోగుల అభినందన సభ ఈనెల 31న నిర్వహించనున్నారు. డోన్ రోడ్డులోని వీజేఆర్ కన్వెన్షన్‌లో బుధవారం సాయంత్రం 5 గంటలకు అభినందన సభ ఏర్పాటవుతుంది. పుష్కరాల విజయవంతానికి సహకరించిన అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలతో అభినందన సభ నిర్వహిస్తామన్నారు. అందరికీ ఉపముఖ్యమంత్రి కేఇ కష్ణమూర్తి, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు.
Advertisement


