లారీ ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు | Three injured in road accident when lorry hits them | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు

Dec 23 2015 10:23 PM | Updated on Sep 3 2017 2:27 PM

పిఠాపురం మండలం నవకండ్రవాడ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

పిఠాపురం(తూర్పుగోదావరి జిల్లా): పిఠాపురం మండలం నవకండ్రవాడ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి కాళ్లపై నుంచి లారీ వెళ్లటంతో కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో కాకినాడ తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement