పుష్కరాలకు వెళ్తే నగలు మాయం | theft in vidyaranya nagar | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు వెళ్తే నగలు మాయం

Aug 21 2016 11:38 PM | Updated on Sep 4 2017 10:16 AM

పుణ్యం కోసం పుష్కరాలకు వెళ్తే.. ఇల్లు లూటీ చేసిన సంఘటన అనంతపురం విద్యారణ్య నగర్‌లో వెలుగు చూసింది.

అనంతపురం సెంట్రల్‌ : పుణ్యం కోసం పుష్కరాలకు వెళ్తే.. ఇల్లు లూటీ చేసిన సంఘటన అనంతపురం విద్యారణ్య నగర్‌లో వెలుగు చూసింది. స్థానిక రెండో పట్టణ పోలీసుల కథనం ప్రకారం... విద్యారణ్య నగర్‌కు చెందిన రవికుమార్‌ కార్ల అనే వ్యాపారి కుటుంబ సభ్యులతో కలసి జీడీపల్లి జలాశయం వద్ద పుష్కరాలకు ఆదివారం ఉదయం బయలుదేరివెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చే సరికి ఇంటిలోని బీరువా తలుపు పగులగొట్టి అందులోని ఏడు తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement