కూతుళ్ల పెళ్లిళ్ల కోసం దొంగతనాలు! | theft for daughters marriage | Sakshi
Sakshi News home page

కూతుళ్ల పెళ్లిళ్ల కోసం దొంగతనాలు!

Jul 14 2015 9:10 AM | Updated on Sep 3 2017 5:29 AM

కూతుళ్ల పెళ్లిళ్ల కోసం దొంగతనాలు!

కూతుళ్ల పెళ్లిళ్ల కోసం దొంగతనాలు!

కుమార్తెలకు వివాహం చేసేందుకు ఓ తండ్రి, తన కుమారుడితో కలిసి దొంగతనాల బాట పట్టాడు. వారిద్దరూ ఆదివారం సాయంత్రం పోలీసులకు పట్టుబడ్డారు.

తిరుపతి, క్రైం: కుమార్తెలకు వివాహం చేసేందుకు ఓ తండ్రి, తన కుమారుడితో కలిసి దొంగతనాల బాట పట్టాడు. వారిద్దరూ ఆదివారం సాయంత్రం పోలీసులకు పట్టుబడ్డారు. తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల మేరకు... తమిళనాడు కడలూరు జిల్లా చిదంబరం సమీపంలోని పరింగిపేటకు చెందిన అహమ్మద్‌మియార్, అతని కుమారుడు ఖాజా మొహిద్దీన్ అలియాస్ రియాజ్ అలియాస్ సాల్మాన్ చెన్నైలోని ఈస్టు కోస్టు రోడ్డులో నివాసముంటున్నారు.

వారిద్దరూ ఆదివారం సాయంత్రం తిరుపతిలోని లక్ష్మీపురం సర్కిల్ వద్ద అనుమానాస్పద స్థితిలో తిరుగుతుండగా పోలీసులు పట్టుకుని విచారిస్తే ఆసక్తికర వాస్తవాలు బయటపడ్డాయి. అహమ్మద్‌మియార్‌కు ముగ్గురు కుమార్తెలున్నారు. వీరి పెళ్లిళ్లు చేసేందుకు  తన కొడుకు రియాజ్‌తో కలిసి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రాలో చోరీలకు పాల్పడేవాడు. ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ జల్సాలు చేసుకునేవారు. వీరిద్దరిపై వేలూరు, చిత్తూరులో  పలు దొంగతనాల కేసులు నమోదయ్యాయి.

చివరగా 2013 సెప్టెంబర్‌లో వీరు బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటి నుంచి  తండ్రి, కొడుకులు కలసి తిరుపతిలోని వేర్వేరు ప్రదేశాల్లో తాళాలు వేసిన ఇళ్లలో దొంగలించిన బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేసి తమ ఇంట్లోనే దాచేశారు. తిరుపతి, తిరుచానూరు పరిధుల్లో 18 ఇళ్లను వీరు దోచుకున్నారు. వారి వద్ద నుంచి 828 గ్రాముల బంగారు, 1.600 కేజీల వెండి వస్తువులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 21,25,000 ఉంటుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement