మెదడువాపు వ్యాధితో బాలిక మృతి | The girl died with encephalitis | Sakshi
Sakshi News home page

మెదడువాపు వ్యాధితో బాలిక మృతి

Aug 14 2016 7:59 PM | Updated on Aug 17 2018 2:56 PM

జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఓడిపెల్లి అఖిల(13) శనివారం అర్ధరాత్రి మెదడువాపు వ్యాధితో చనిపోరుుంది.

జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఓడిపెల్లి అఖిల(13) శనివారం అర్ధరాత్రి మెదడువాపు వ్యాధితో చనిపోరుుంది. ఒడ్డెపల్లి స్వామి, లక్ష్మి దంపతుల కూతురు అఖిల కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మూడు రోజుల క్రితం రక్త పరీక్షలు చేస్తే రక్తకణాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. దీంతో ఆమెను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. తలనొప్పి ఎక్కువగా ఉందని తెలుపడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి మెదడు వాపు వ్యాధిగా నిర్ధారించారని తల్లిదండ్రులు తెలిపారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి అఖిల మృతిచెందిందని పేర్కొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement