రాష్ట్రంలో దుష్ట పాలనను తరి మేద్దాం | The extinction of the evil regime | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో దుష్ట పాలనను తరి మేద్దాం

Feb 23 2017 10:21 PM | Updated on Sep 5 2017 4:26 AM

రాష్ట్రంలో దుష్ట పాలనను తరి మేద్దాం

రాష్ట్రంలో దుష్ట పాలనను తరి మేద్దాం

రాష్ట్రంలో టీడీపీ దుష్టపాలనను తరిమేద్దామని వైఎస్‌ఆర్‌సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి పట్టభద్రులకు పిలుపునిచ్చారు. గురువారం వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీరంగడు అధ్యక్షత జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

- వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి
 
పత్తికొండ : రాష్ట్రంలో టీడీపీ దుష్టపాలనను తరిమేద్దామని వైఎస్‌ఆర్‌సీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి పట్టభద్రులకు పిలుపునిచ్చారు. గురువారం వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీరంగడు అధ్యక్షత జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  సీఎం చంద్రబాబు విదేశాలు తిరుగుతూ రూ.కోట్లు దుర్వినియోగం చేయడంతో రాష్ట్రం దివాళా తీసిందన్నారు. ఎన్నికల్లో విద్యార్థులు, రైతులు, పొదుపు మహిళలు, పట్టభద్రులకు అబద్ధపు హామీల ఇచ్చి అధికారంలోకి వచ్చాడని విమర్శించారు. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సీఎం చేస్తున్న అవినీతి, అక్రమాలను  అడ్డుకుంటున్నాడే తప్ప రాష్ట్ర అభివృద్ధిని కాదన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులు, యువకులపై పీడీ యాక్టు, రౌడీషీట్‌ నమోదు చేస్తామని ప్రభుత్వం బెదిరించడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో 1.40 లక్షలు పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు.
రాష్ట్రం అధోగతి పాలు..
టీడీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని నియోజకవర్గ ఇన్‌చార్జీ చెరుకులపాడు నారాయణరెడ్డి విమర్శించారు. వెన్నపూస గోపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు.  నాయకులు జూటూరు బజారప్ప, జిట్టా నాగేష్, మురళిధర్‌రెడ్డి, రాజశేఖర్‌రావు, కారం నాగరాజు, నరసింహయ్య ఆచారి మల్లికార్జునయాదవ్, స్టీవెన్, విష్ణువర్ధన్‌, ప్రహ్లాదరెడ్డి, ఎర్రగుడి రామచంద్రరెడ్డి, జగన్నాథ్‌రెడ్డి, మధుసూదన్‌నాయుడు, భద్రయ్య, టీఎం రమేష్, ఇమ్రాన్, శ్రీనివాసులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement