టీడీపీ నేత ఓవరాక్షన్ | TDP leader ovaraksan | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత ఓవరాక్షన్

Jul 28 2016 4:38 PM | Updated on Aug 10 2018 9:46 PM

పంచాయితీ పేరుతో ఓ టీడీపీ నేత సామాన్యుడిని చితకొట్టాడు.

పంచాయితీ పేరుతో వ్యక్తిపై దాడి

బుక్కరాయసముద్రం :

పంచాయితీ పేరుతో ఓ టీడీపీ నేత సామాన్యుడిని చితకొట్టాడు.  బాధితులు తెలిపిన వివరాలు మేరకు మండల పరిధిలోని పొడరాళ్ల  గ్రామానికి చెందిన ఎరికల వెంకటనారాయణ కూలి పనులు చూసుకుంటూ జీవనం గడుపుతున్నారు.  గత నెల రోజుల క్రితం అనంతపురం సిండికేట్‌నగర్‌కు చెందిన వన్నూరమ్మతో కొంత మొత్తం తీసుకున్నాడు. అప్పు ఇవ్వాలని వన్నూరమ్మ అడగ్గా కొంత సమయం ఇస్తే ఇచ్చేస్తానని చెప్పానన్నాడు.

ఈ విషయంలో వడియంపేట మాజీ సర్పంచ్, టీడీపీ నేత పరిశే శ్రీనివాసులు కలుగజేసుకుని తన ఇంటి వద్దకు రావాలని వెంకటనారాయణకు పలుమార్లు ఫోన్‌ చేసి పిలిచాడు. వాళ్ల ఇంటి దగ్గరకు వెళ్లగానే శ్రీనివాసులు అతని అనుచరులు గోపాల్, నరసింహులు, క్రిష్ణమూర్తిలు వెంకటనారాయణపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.  ప్రస్తుతం వెంకటనారాయణ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

నా భర్తను టీడీపీ నేత శ్రీనివాసులు అన్యాయంగా కొట్టాడని వెంకటనారాయణ భార్య అంజనమ్మ వాపోయింది. గత ఎన్నికలో 8 వార్డు మెంబర్‌గా గెలిచాననీ... వాళ్ల పార్టీకి పిలిస్తే రాలేదన్న కక్షతోనే ఈ దాడికి పాల్పడ్డారన్నారు. జిల్లా అధికారులే న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement