ఏఈఓపై టీడీపీ నాయకుడి దౌర్జన్యం | TDP leader outrage on aeo | Sakshi
Sakshi News home page

ఏఈఓపై టీడీపీ నాయకుడి దౌర్జన్యం

Oct 8 2016 11:38 PM | Updated on Aug 10 2018 9:46 PM

మండలకేంద్రంలో పప్పుశనగ పంపిణీ సందర్భంగా ఏఈఓ గోపాల్‌పై టీడీపీ నాయకుడు శనివారం దౌర్జన్యానికి పాల్పడ్డారు.

డీ.హీరేహాళ్‌ : మండలకేంద్రంలో పప్పుశనగ పంపిణీ సందర్భంగా ఏఈఓ గోపాల్‌పై టీడీపీ నాయకుడు శనివారం దౌర్జన్యానికి పాల్పడ్డారు. పప్పుశనగ టోకన్లకోసం మాజీ జెడ్పీటీసీ శ్రీరామజ్యోతి భర్త శ్రీరాములు తన విధులకు ఆటంకం కలిగించడమే కాక దుర్భాషలాడినట్లు ఏఈఓ గోపాల్‌ తెలిపారు.
 
టీడీపీ నాయకుడికి ఎలాంటి నల్లరేగడి భూమి లేకున్నా పప్పుశనగ కొనుగోలుకు వచ్చాడని, అయితే ఏఓతో అనుమతి తీసుకోవాలని సూచించినా పట్టించుకోలేదన్నారు. ‘నువ్వు అధికారివి కాదా, నీకు పని చేయడం రాదా’ అంటూ నానా హంగామా చేసినట్లు ఏఈఓ వాపోయారు. చివరికి నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఏఈఓ డీ.హీరేహాళ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement