డెంగీ జ్వరంతో విద్యార్థిని మృతి | student dies of dengue fever | Sakshi
Sakshi News home page

డెంగీ జ్వరంతో విద్యార్థిని మృతి

Aug 26 2017 10:06 PM | Updated on Nov 9 2018 4:36 PM

మండలంలోని 74 ఉడేగోళం గ్రామానికి చెందిన త్రిష ( 6) అనే ఒకటవ తరగతి విద్యార్థిని డెంగీ జ్వరంతో మృతి చెందింది.

రాయదుర్గంరూరల్: మండలంలోని 74 ఉడేగోళం గ్రామానికి చెందిన త్రిష ( 6) అనే ఒకటవ తరగతి విద్యార్థిని డెంగీ జ్వరంతో మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన హరిజన రత్నమ్మ, నింగప్ప దంపతుల కుమార్తె త్రిషకు జ్వరంగా ఉండంతో కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రిలో నాలుగు రోజులు అక్కడే చికిత్స చేశారు. రక్తకణాలు తక్కువగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడా నాలుగు రోజులు చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement