పునరావాస కాలనీల పనులు వేగవతం చేయాలి | speed the Rehabilitation workes | Sakshi
Sakshi News home page

పునరావాస కాలనీల పనులు వేగవతం చేయాలి

Aug 5 2016 10:56 PM | Updated on Mar 21 2019 8:35 PM

ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టుల నిర్వాసితుల పునరావాస కాలనీల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ నీతూప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పనుల ప్రగతిపై సమీక్షించారు.

  •  కలెక్టర్‌ నీతూప్రసాద్‌
  • ముకరంపుర: ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టుల నిర్వాసితుల పునరావాస కాలనీల పనులను వేగవంతం చేయాలని  కలెక్టర్‌ నీతూప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పనుల ప్రగతిపై సమీక్షించారు. కోటిలింగాల, చెగ్యాం, చీర్లవంచ పునరావాస కాలనీల పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోటిలింగాలకు మంజూరైన హైలెవల్‌ బ్రిడ్జి పనులను వర్షాలు తగ్గగానే ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. కొత్తగా నిర్మించే కాలనీల్లో తాగునీరు, రోడ్లు ఇతర సౌకర్యాలను కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శ్రీదేవసేన, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 
     
     

Advertisement
 
Advertisement
Advertisement