'ఆ అణువిద్యుత్ ప్లాంట్ ప్రతిపాదన ఇప్పటిది కాదు' | solar power plant inauguration by ashok gajapathi raju at municipal office in vizianagaram | Sakshi
Sakshi News home page

'ఆ అణువిద్యుత్ ప్లాంట్ ప్రతిపాదన ఇప్పటిది కాదు'

Jul 14 2016 5:51 PM | Updated on Oct 22 2018 8:31 PM

'ఆ అణువిద్యుత్ ప్లాంట్ ప్రతిపాదన ఇప్పటిది కాదు' - Sakshi

'ఆ అణువిద్యుత్ ప్లాంట్ ప్రతిపాదన ఇప్పటిది కాదు'

దేశంలో లక్ష మెగావాట్ల సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్గజపతి రాజు తెలిపారు.

విజయనగరం : దేశంలో లక్ష మెగావాట్ల సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్గజపతి రాజు తెలిపారు. గురువారం విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో 55 కెవి సోలార్ పవర్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు.

అనంతరం అశోక్గజపతి రాజు మాట్లాడుతూ... సోలార్ విద్యుత్ తయారీకి ముందుకు రావాలని స్థానిక సంస్థలకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ ప్రతిపాదన ఈ నాటిది కాదని అశోక్గజపతిరాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement