గంజాయి స్మగ్లర్ల అరెస్ట్‌ | smaglars arest | Sakshi
Sakshi News home page

గంజాయి స్మగ్లర్ల అరెస్ట్‌

Sep 12 2016 10:55 PM | Updated on Nov 6 2018 5:21 PM

పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ౖయెటింక్లయిన్‌కాలనీలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని సోమవారం పట్టుకున్నట్లు సీఐ దేవారెడ్డి తెలిపారు.

గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ౖయెటింక్లయిన్‌కాలనీలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని సోమవారం పట్టుకున్నట్లు సీఐ దేవారెడ్డి తెలిపారు. స్థానిక శ్రీలంక షిర్కేక్వార్టర్స్‌ ఏరియాలోని పోచమ్మ గుడి వద్ద గంజాయి అమ్ముతున్న కమలాపూర్‌ మండలం ఉప్పల్‌కు చెందిన మహ్మద్‌ యాకూబ్‌పాషా, పెద్దపల్లికి చెందిన సయ్యద్‌ షాహిద్‌ను కానిస్టేబుళ్లు జె.రమేష్, ఓ.కృష్ణారెడ్డిలు చాకచక్యంగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వీరి నుంచి రూ.4,400 విలువచేసే గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని  కమాన్‌పూర్‌ తహసీల్దార్‌ హన్మంతరావుతో పంచనామా చేయించారు.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement