రెండోరోజు కొనసాగిన దేహదారుడ్య పరీక్షలు | second day continues physical tests | Sakshi
Sakshi News home page

రెండోరోజు కొనసాగిన దేహదారుడ్య పరీక్షలు

Dec 9 2016 9:33 PM | Updated on Aug 21 2018 5:51 PM

రెండోరోజు కొనసాగిన దేహదారుడ్య పరీక్షలు - Sakshi

రెండోరోజు కొనసాగిన దేహదారుడ్య పరీక్షలు

పోలీసు కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శుక్రవారం రెండో రోజు దేహధారుఢ్య పరీక్షలు కొనసాగాయి.

– 927 మంది హాజరు
– 564 మంది మెయిన్స్‌ ఎంపిక
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : పోలీసు కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శుక్రవారం రెండో రోజు దేహధారుఢ్య పరీక్షలు కొనసాగాయి. జిల్లా ఎస్పీ ఆర్‌కే రవికృష్ణ పర్యవేక్షణలో అభ్యర్థుల పరుగు, కొలతలు, సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. మొత్తం 927 మంది అభ్యర్థులు హాజరవ్వగా 564 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. సర్టిఫికెట్లు లేకపోవడంతో 136 మంది అభ్యర్థులను వెనక్కి పంపినట్లు అధికారులు తెలిపారు.    

Advertisement
 
Advertisement
Advertisement