వెంకన్న ఆదాయం రూ. 89 కోట్లు | rs. 89 crore of hundi collection in tirumala | Sakshi
Sakshi News home page

వెంకన్న ఆదాయం రూ. 89 కోట్లు

Jul 1 2016 12:38 PM | Updated on Sep 4 2017 3:54 AM

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని జూన్ నెలలో 24.7 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో సాంబశివరావు తెలిపారు.

తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని జూన్ నెలలో 24.7 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో సాంబశివరావు తెలిపారు. 94 లక్షల లడ్డూలు భక్తులకు పంపిణీ చేశామని.. ఈ నెలలో హుండీ ద్వారా రూ. 89 కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. ప్రత్యేక దర్శన టికెట్లు 90 రోజులు ముందుగానే ఆన్‌లైన్ ద్వారా తీసుకునే ఏర్పాట్లు చేశామన్నారు. త్వరలోనే బంగారు, వెండి శ్రీవారి డాలర్లతో పాటు రాగి డాలర్లను కూడా భక్తులకు విక్రయించడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement