కిరాణా వ్యాపారి ఇంట్లో పగలే చోరీ | robbery in general merchant house | Sakshi
Sakshi News home page

కిరాణా వ్యాపారి ఇంట్లో పగలే చోరీ

Nov 10 2016 2:16 AM | Updated on Aug 30 2018 5:27 PM

దేవరపల్లి : దేవరపల్లిలో బుధవారం మధ్యాహ్నం చోరీ జరిగింది. రూ.80వేల నగదు, పదికాసుల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక బస్టాండ్‌కు సమీపంలోని

దేవరపల్లి : దేవరపల్లిలో బుధవారం  మధ్యాహ్నం చోరీ జరిగింది. రూ.80వేల నగదు, పదికాసుల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక బస్టాండ్‌కు సమీపంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వెనుకవైపున గల కిరాణా వ్యాపారి కొత్త శేఖర్, లక్ష్మి దంపతుల ఇల్లు ఉంది.  వారు ఉదయమే ఇంటికి తాళం వేసి కిరాణా దుకాణానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చి చూసేసరికి తలుపులు తీసి ఉన్నాయి. అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా, బెడ్‌రూంలోని బీరువాలో పెట్టిన రూ.80వేలు, పది కాసుల బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఇంటి వెనుక తలుపులు కూడా తీసి ఉన్నాయి. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ మేరకు కొవ్వూరు సీఐ ఎం.సుబ్బారావు, ఎస్‌ఐ చిన్నం ఆంజనేయులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.   వేలిముద్రల నిపుణుల బృందం సీఐ కె.నరసింహమూర్తి, సిబ్బంది ఆధారాలు సేకరించారు.  మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య దొంగతనం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement