భక్తులారా.. ఈ జాగ్రత్తలు పాటించండి.. | restrictions for piligrims who attend for holy bath | Sakshi
Sakshi News home page

భక్తులారా.. ఈ జాగ్రత్తలు పాటించండి..

Jul 14 2015 12:47 PM | Updated on Aug 1 2018 5:04 PM

గోదావరి పుష్కరాల సందర్భంగా స్నానఘట్టాల వద్ద భక్తులు పాటించాల్సిన నియమావళిని రూపొందించారు.

రాజమండ్రి / ఏలూరు: గోదావరి పుష్కరాల సందర్భంగా స్నానఘట్టాల వద్ద భక్తులు పాటించాల్సిన నియమావళిని రూపొందించారు. పుష్కర యాత్రికులు అప్రమత్తంగా ఉంటూ.. స్నానఘట్టాల వద్ద ఈ సూచనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

  • ప్రభుత్వం సూచించిన స్నానఘట్టాలలోనే స్నానం చేయాలి
  • పిల్లలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులకు ముందుగా స్నానం చేసే అవకాశం ఇవ్వాలి
  • క్యూ పద్ధతి పాటించాలి
  • వీలైనంత తక్కువ సమయంలో పుష్కర స్నానం చేసి మిగతా వారికి అవకాశం ఇవ్వండి
  • ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే పోలీసులకు, 108 వాహనానికి సమాచారం అందించండి
  • హారతి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండటం
  • పొగతాగడం నిషేధం
  • ప్రైవేట్ వాహనాల్లో కాకుండా ప్రజా రవాణా వాహనాల్లోనే వెళ్లేందుకు ప్రయత్నించడం
  • ఏదైనా సమస్య అనిపిస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం. భక్తులు కంగారు పడి ఆందోళన కలిగిస్తే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంటుందని గుర్తించి మసలుకోవాలి
  • స్నాన ఘట్టాల వద్ద భక్తులు వినియోగించే మెటీరియల్ వేసేందుకు ఆరెంజ్ రంగు డస్ట్బిన్ లు, పిండ ప్రదానం జరిగే ప్రదేశాల్లో వెదురు డస్ట్ బిన్లలో వ్యర్ధపదార్థాలను పడవేయాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement