నడిరోడ్డుపై రియల్టర్‌ కిడ్నాప్‌ | realtor Kidnapped in lungurhouse | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై రియల్టర్‌ కిడ్నాప్‌

Sep 9 2016 12:09 AM | Updated on Sep 4 2017 12:41 PM

నడిరోడ్డుపై రియల్టర్‌ కిడ్నాప్‌

నడిరోడ్డుపై రియల్టర్‌ కిడ్నాప్‌

ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌కు కూత వేటు దూరంలో నడిరోడ్డుపై కొందరు దుండగులు బుధవారం సాయంత్రం ఓ రియల్టర్‌ను కిడ్నాప్‌ చేశారు.

లంగర్‌హౌస్‌:  ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌కు కూత వేటు దూరంలో నడిరోడ్డుపై కొందరు దుండగులు బుధవారం సాయంత్రం ఓ రియల్టర్‌ను కిడ్నాప్‌ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.... లంగర్‌హౌస్‌ పద్మానాభనగర్‌ కాలనీ నివాసి దావూద్‌(35) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. మొఘల్‌నగర్‌లో ఉండే స్నేహితుడు ఇల్యాజ్‌తో కలిసి సొంత పనిపై టోలిచౌకీ వెళ్లాడు.

బుధవారం సాయంత్రం ఆరు గంటలకు కారులో అక్కడి నుంచి మెహిదీపట్నం వెళ్తుండగా.. నానల్‌నగర్‌ వద్ద టోలిచౌకీ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్ కు ఎదురు రోడ్డులో వేగంగా దూసుకు వచ్చిన రెండు కార్లు వీరి కారుకు అడ్డంగా నిలిచాయి.  కార్లలోంచి దిగిన కొందరు దావూద్‌పై దాడి చేసి పెప్పర్‌ స్పే్ర చల్లారు. అనంతరం దావూద్‌ను కిడ్నాప్‌ చేసి తమ కారు (ఏపీ 28 డీసీ 4392)లో తీసుకెళ్లారు. దావూద్‌ స్నేహితుడు ఇల్యాజ్‌ను తీవ్రంగా కొట్టి రోడ్డుపై పడేశారు.

నడిరోడ్డుపై జరిగిన ఈ కిడ్నాప్‌ను చూసి వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. కొద్దిసేపటికి కోలుకున్న ఇల్యాజ్‌ స్థానికుల సహాయంతో లంగర్‌హౌస్‌ పోలీసులను ఆశ్రయించారు.  ఇల్యాజ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ గౌస్‌మొహినుద్దీన్ ఆధ్వర్యం లో ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసి వెంటనే గాలింపు ప్రారంభించారు. కిడ్నాపర్‌ దావూద్‌ పెదనాన్న కుమారుడు ముజాఫర్‌గా అనుమానిస్తున్నట్లు ఇల్యాజ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అందరినీ కిడ్నాప్‌ చేస్తా...
కిడ్నాప్‌ చేసింది ఎవరని పోలీసులు విచారణ చేస్తుండగా మరి కొందరు బాధితులు లంగర్‌హౌస్‌ఠాణాకు  వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు షాక్‌ అయ్యారు. రియల్టర్‌ దావూద్‌ను అరెస్టు చేశానని, తనకు డబ్బు ఇవ్వకుపోతే మిమ్మల్ని కూడా కిడ్నాప్‌ చే స్తానని ఓ వ్యక్తి  బెదిరిస్తున్నట్లు భాదితులు పేర్కొన్నారు. గతంలో ముజాఫర్‌ తమతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నాడన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement