breaking news
Langarhaus
-
లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు స్వాధీనం
-
నడిరోడ్డుపై రియల్టర్ కిడ్నాప్
లంగర్‌హౌస్: ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌కు కూత వేటు దూరంలో నడిరోడ్డుపై కొందరు దుండగులు బుధవారం సాయంత్రం ఓ రియల్టర్‌ను కిడ్నాప్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.... లంగర్‌హౌస్ పద్మానాభనగర్ కాలనీ నివాసి దావూద్(35) రియల్ ఎస్టేట్ వ్యాపారి. మొఘల్నగర్లో ఉండే స్నేహితుడు ఇల్యాజ్‌తో కలిసి సొంత పనిపై టోలిచౌకీ వెళ్లాడు. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు కారులో అక్కడి నుంచి మెహిదీపట్నం వెళ్తుండగా.. నానల్‌నగర్ వద్ద టోలిచౌకీ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ కు ఎదురు రోడ్డులో వేగంగా దూసుకు వచ్చిన రెండు కార్లు వీరి కారుకు అడ్డంగా నిలిచాయి. కార్లలోంచి దిగిన కొందరు దావూద్‌పై దాడి చేసి పెప్పర్ స్పే్ర చల్లారు. అనంతరం దావూద్‌ను కిడ్నాప్ చేసి తమ కారు (ఏపీ 28 డీసీ 4392)లో తీసుకెళ్లారు. దావూద్ స్నేహితుడు ఇల్యాజ్‌ను తీవ్రంగా కొట్టి రోడ్డుపై పడేశారు. నడిరోడ్డుపై జరిగిన ఈ కిడ్నాప్‌ను చూసి వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. కొద్దిసేపటికి కోలుకున్న ఇల్యాజ్ స్థానికుల సహాయంతో లంగర్‌హౌస్ పోలీసులను ఆశ్రయించారు. ఇల్యాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆసిఫ్‌నగర్ ఏసీపీ గౌస్‌మొహినుద్దీన్ ఆధ్వర్యం లో ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసి వెంటనే గాలింపు ప్రారంభించారు. కిడ్నాపర్ దావూద్ పెదనాన్న కుమారుడు ముజాఫర్గా అనుమానిస్తున్నట్లు ఇల్యాజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అందరినీ కిడ్నాప్ చేస్తా... కిడ్నాప్ చేసింది ఎవరని పోలీసులు విచారణ చేస్తుండగా మరి కొందరు బాధితులు లంగర్హౌస్ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు షాక్ అయ్యారు. రియల్టర్ దావూద్‌ను అరెస్టు చేశానని, తనకు డబ్బు ఇవ్వకుపోతే మిమ్మల్ని కూడా కిడ్నాప్ చే స్తానని ఓ వ్యక్తి బెదిరిస్తున్నట్లు భాదితులు పేర్కొన్నారు. గతంలో ముజాఫర్ తమతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నాడన్నారు. -
టెన్త్ విద్యార్థినిపై బాలుడి లైంగికదాడి
లంగర్‌హౌస్: బాలికను కిడ్నాపై చేసి.. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడో బాలుడు. నిందితుడిని అరెస్టు జువైనల్ కోర్టుకు తరలించారు. లంగర్‌హౌస్ ఎస్సై మహమ్మద్ జాహెద్ తెలిపిన వివరాల ప్రకారం... టోలిచౌకి పారమౌంట్ కాలనీకి చెందిన బాలిక (13) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గోల్కొండ ప్రాంతంలో నివాసముండే ఓ బాలుడు (17) టోలిచౌకిలోని మొబైల్ షాపులో పని చేస్తున్నాడు. కొద్ది నెలల క్రితం తండ్రి సెల్‌ఫోన్ రీఛార్జి చేయించడానికి బాలిక ఆ మొబైల్ దుకాణానికి వెళ్లింది. అప్పటి నుంచీ బాలుడు ఆమె వెంటపడి ప్రేమించాలని వేధిస్తున్నాడు. వారం క్రితం బాలిక తండ్రి అనారోగ్యానికి గురికావడంతో నానల్‌నగర్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. తండ్రిని చూడటానికి ఓ రోజుల బాలికి ఆసుపత్రికి వెళ్లడం బాలుడు గమనించాడు. శనివారం ఆసుపత్రి వద్ద కాపుకాసి బాలికను ఆమె తండ్రి ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ మాటలు కలిపాడు. ఆమెకు మాయమాటలు చెప్పి శంకర్పల్లి తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితుడి ఇంట్లో ఉంచి లైంగికదాడికి పాల్పడ్డాడు. జరిగిన విషయం ఎవరికైనా చెప్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించి, సోమవారం ఉదయం బాలికను టోలిచౌకిలో వదిలి వెళ్లాడు. బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. లంగర్‌హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని జువైనల్ జస్టిస్ కోర్టుకు తరలించారు.